విషపూరిత పక్షులు

ప్రపంచంలో 10 విషపూరిత పక్షులున్నాయి. ప్రత్యర్థి నుంచి ప్రాణ రక్షణకు విషాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ 10 పక్షులు మిగిలినవాటికి భిన్నమైనవి.

';

Blue Capped Ifrita

ఇది న్యూ గినియాకు చెందింది. ఇది బ్యాట్రకోటాక్సిన్ చిమ్ముతుంది. ప్రత్యర్థి నుంచి కాపాడుకునేందుకు డిఫెన్స్ మెకానిజంలా ఉపయోగపడుతుంది

';

Common Quail

ఇందులో కొన్ని పక్షులు విషపూరిత మొక్కల్ని తిని విషపూరితంగా మారుతాయి. వీటి మాంసం తింటే Coturnismకు దారి తీస్తుంది. అంటే కండరాల వదులవడం, కిడ్నీలు విఫలమవడం. ఇది అత్యంత ప్రమాదకరమైంది

';

crested Bronzewing Pigeon

ఇది విషపూరితమైన గ్యాస్ట్రోలోబియమ్ మొక్కల్ని తినగలదు. అయినా వీటికేం కాదు. వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో సురక్షితంగా మనగలిగేందుకు ఈ పక్షులకు ఈ మొక్కలు దోహదపడతాయి.

';

Eurasian Redstart

ఇదొక చిన్న పస్సేరిన్ పక్షి. విషపూరిత కీటకాల్ని తింటుంది. ఈ పక్షి జీర్ణం చేసుకునే విషం వాటికి వివిధ రకాలుగా రక్షణ అందిస్తుంది. అయితే ఈ రకం పక్షులన్నీ విషపూరితం కావు

';

Great Jacamar

ఇదొక రంగు రంగుల పక్షి. మధ్య, దక్షిణ అమెరికాలో ఉంటుంది. విషపూరిత కీటకాలను తింటుంది. ఈ ఆహారం ఈ పక్షులకు ప్రత్యర్ధుల్నించి కాపాడుకునే కెమికల్ డిఫెన్స్ అందిస్తుంది.

';

Hooded Pitohul

ఈ పక్షి కూడా న్యూ గినియాకు చెందిందే. ఈ పక్ష రెక్కలు, చర్మంపై బ్యాట్రకోటాక్సిన్ విషం ఉంటుంది. ఇలాంటి విషయం పాయిజన్ డార్ట్ ఫ్రాక్స్ లో ఉంటుంది. మనుషుల్నించి కాపాడుకునేందుకు ఈ పక్షికి ఈ విష సహకరిస్తుంది

';

Horned Lark

ఇది ఉత్తర ధృవ ప్రాంతంలో కన్పిస్తుంది. ఒక్కోసారి విషపూరితమైన బీటిల్స్ తింటుంది. ఈ విషం కారణం ప్రత్యర్ధుల్నించి ప్రతికూల వాతావరణం నుంచి రక్షణ కల్పిస్తుంది

';

Mistletoe bird

ఈ పక్షి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది Mistletoe బెర్రీస్ తింటుంది. ఇవి చాలా జంతువులకు విషపూరితమైనవి. ఇవి మాత్రం సునాయసంగా తింటాయి. ఎందుకంటే ఈ పక్షుల జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా ఉంటుంది.

';

Rufous Shrikethrush

ఈ పక్షి ఆస్ట్రేలియా, న్యూ గినియాలో కన్పిస్తుంది. ఈ పక్షి కణాల్లో బ్యాట్రాకోటాక్సిన్ విషం ఉంటుంది. ఈ విషం ఈ పక్షికి శత్రువుల్నించి కాపాడుకునే సామర్ధ్యాన్ని ఇస్తుంది

';

Spur Winged Goose

ఈ పక్షి సబ్ సహారన్ ఆఫ్రికాలో కన్పిస్తుంది. బ్లిస్టర్ బీటిల్స్ తినడం ద్వారా విషాన్ని జీర్ణించుకుంటాయి. ఈ విషం ఈ పక్షిపై ఇతర జంతువులు దాడి చేయకుండా కాపాడేందుకు సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story