ప్రపంచంలోని ఈ 5 ఊర్ల ప్రజలు పాముల్ని పెంచి స్నేక్ ఫార్మింగ్‌తో కోటీశ్వరులవుతున్నారంటే నమ్మగలరా
శ్రావణ మాసం వచ్చిందంటే పాముల గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే అదే పాములతో వ్యవసాయం చేసి కోటీశ్వరులవుతున్నారు కొందరు
పాములతో తయారయ్యే మూలికలను చాలా రకాల వ్యాధులకు చికిత్స గా ఉపయోగిస్తుంటారు.
ఈ పాముల్ని చెక్క, గాజుతో చేసిన పెట్టెల్లో పెట్టి పెంచుతుంటారు
ప్రపంచంలోని ఆ ఊరిలో దాదాపు 170 కుటుంబాలు ప్రతి ఏటా 30 లక్షల పాములు పుట్టిస్తున్నారు.
ఈ ఊరు మరెక్కడో లేదు చైనాలో ఉంది. ఈ ఊరి పేరు జిసికయావో. చాలా ఏళ్లుగా ఇక్కడి స్నేక్ ఫార్మింగ్ చర్చనీయాంశంగా మారుతోంది.
కింగ్ కోబ్లా, వైపర్, ర్యాటిల్ స్నేక్ ఇలా అన్ని విషపూరిత పాముల్ని పెంచుతున్నారు.
అంతేకాదు..ఇక్కడ బొద్దింకలు, దోమల్ని కూడా పుట్టిస్తున్నారు.
జంతువుల్ని పెంచినట్టే వీటిని కూడా పెంచుతుంటారు. పాముల్ని అదే విధంగా పెంచుతున్నారు.