నాగుపాము మరియు కింగ్ కోబ్రా మధ్య తేడా ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెండూ విషపూరితమైన పాములే, అయితే ఏది ప్రమాదకరమో, వీటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.
కింగ్ కోబ్రాస్ 18 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అదే నాగుపాములు అయితే రెండు నుంచి పది అడుగుల వరకు ఉంటాయి.
కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరమైనది. దానిలోని న్యూరోటాక్సిన్ విషం చాలా ప్రాణాంతకమైనది, ఇది కొన్ని గంటల్లో ఏనుగును కూడా చంపగలదు. నాగుపాము విషం కూడా డేంజరే. అయితే కింగ్ కోబ్రా విషం చాలా తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు తీయగలదు.
చాలా నాగుపాములు వివిధ రకాల జీవులను తింటాయి, అయితే కింగ్ కోబ్రా యొక్క ప్రధాన ఆహారం నాగుపాములతో సహా ఇతర పాములు! అంటే వాటి విషం ఇతర పాములను కూడా చంపేంత శక్తివంతమైనది.
నాగుపాములు కంటే కింగ్ కోబ్రాలు చాలా వేగవంతంగా దాడి చేస్తాయి.
కింగ్ కోబ్రాస్ దట్టమైన అడవులలో నివసిస్తాయి, అక్కడ అవి చాలా అరుదుగా కనిపిస్తాయి. నాగుపాములు అయితే ఎక్కువగా మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి.
మీరు పాము కాటుకు గురైనట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.