సమ్మర్ వచ్చిందంటే చాలా మంది అతిగా ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు.
కనీసం బాటిళ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొరు.
దీంతో బాటిల్ లోపల అడుగుభాగంలో బ్యాక్టిరియా చేరిపోయి ఉంటుంది.
చల్లని నీళ్లు తాగడం వల్ల.. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.
ఆహారం సరిగ్గా జీర్ణమవక మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.
దీనివల్ల కొందరిలో నోటిలో పుండ్లు కూడా వస్తాయి.
క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడి పొట్ట ఉబ్బుతుంది.
ఇది ఇమ్యునిటిపై కూడా ప్రభావం చూపిస్తుంది.
చల్లని నీళ్లు తాగగానే పళ్లు జివ్వుమని దంత సమస్యలు ఏర్పడతాయి.