అల్లు అర్జున్‌కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరింది. ఈ మైనపు విగ్రహాన్ని అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లి స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత అందుకున్న మూడో హీర
అల్లు అర్జున్ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరింది. సూపర్ స్టార్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో కొలువైంది.
ఇక తెలుగు సహా దక్షిణాది నుంచి మేడమ్ టుసాడ్స్‌లో కొలువు దీరిన మొట్ట మొదటి హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ఈయన విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లో సింగపూర్‌లో కొలువు తీరింది.
ఇక మన దేశంలో మేడమ్ టుస్సాడ్‌లో కొలువైన మొట్ట మొదటి భారతీయుడు మరియు ఏషియన్ నటుడిగా అమితాబ్ బచ్చన్ రికార్డులకు ఎక్కాడు. బిగ్‌బీ నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాల జాతర మొదలైంది.
అమితాబ్ బచ్చన్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరారు బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్.
అటు సల్మాన్ ఖాన్ మైనపు విగ్రహాం లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్‌లో కొలువు తీరింది.
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ మైనపు విగ్రహాన్ని కూడా మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరింది. అటు బాలీవుడ్ నుంచి వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, కరణ్ జోహార్ సహా పలువురు మైనపు విగ్రహాలు అక్కడ కొలువు తీరాయి.
అటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన నార్త్ భామ కాజల్ అగర్వాల్.. మైనపు విగ్రహంగా కొలువైన తొలి సౌత్ స్టార్.
అటు అతిలోకసుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆమె చనిపోయిన తర్వాత.. మిస్టర్ ఇండియాలోని శ్రీదేవి గెటప్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈమె కంటే ముందు ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజోల్, అనుష్క శర్మ, దీపికా పదుకొణే,
అటు రాజకీయాల నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుతీరిన ఏకైక భారతీయ రాజకీయ వేత్త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే. అందులో మహాత్మ గాంధీ, ఇందిరా సహా వివిధ దేశాధినేతల మైనపు విగ్రహాలను వాళ్ల చనిపోయిన తర్వాత కొలువు తీరడం విశేషం.