‘12th ఫెయిల్’ సహా నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమాలు ఇవే..
విక్రాంత్ మాస్సే-నటించిన ఈ చిత్రం IPS అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను భారత్ - అప్ఘనిస్తాన్ సరిహద్దులో 36 మంది సిక్కు సైనికులు వెయ్యి మంది అఫ్ణాన్ సైనికులను ఎలా ఓడించారనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సోనమ్ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా 73 మంది ప్రయాణీకులను తీవ్రవాద హైజాకర్ల నుండి కాపాడడానికి తన ప్రాణాలను నీర్జా బానోత్ ఎలా ప్రాణ త్యాగం చేసిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
హృతిక్ రోషన్ ఇది నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.
విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ‘ఉరి’లోని భారత సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
సర్ధార్ ఉధమ్ సింగ్..జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు ప్రతీకారంగా జనరల్ డయ్యర్ ను చంపడానికి లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకొని.. ఉరి కంబం ఎక్కుతాడు. ఈ సినిమా ఓటీట వేదికగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మాజీ ప్రధాన మంత్రిని ఎల్టీటీఈ ఉగ్రవాదులు బెల్ట్ బాంబ్ తో ఎలా మట్టుపెట్టారనే కాన్సెప్ట్ తో ‘మద్రాస్ కేఫే’ సినిమాను తెరకెక్కించారు.
2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసు ఆధారంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.