దివ్య భారతి మరణం.. ఆ హీరోయిన్స్ కు వరం..
దివ్యభారతి 19 యేళ్ల చిరు ప్రాయంలోనే ముంబైలోని తన 5వ అంతస్తులోని అపార్ట్ మెంట్ బాల్కనీ నుండి పడి మరణించింది.
దివ్యభారతి హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
అప్పటికే దివ్యభారతి 10 నుంచి 12 చిత్రాలకు సైన్ చేసి ఓకే చేసింది. ఆమె మరణంతో ఆయా చిత్రాల్లో వేరే హీరోయిన్స్ ను తీసుకున్నారు.
అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘దిల్ జలే’ సినిమాలో దివ్యభారతి ప్లేస్ లో రవీనా టాండన్ ను తీసుకున్నారు.
దివ్యభారతి మరణంతో అజయ్ దేవగణ్ ‘హల్ చల్’ మూవీలో కాజోల్ ను కథానాయకగా ఎంపికైంది.
దివ్యభారతి ఆకస్మిక మరణంతో ‘ధన్వాన్’లో కరిష్మా కపూర్ ఎంట్రీ ఇచ్చింది.
మనీషా కొయిరాల నటించిన ‘కన్యాదాన్’ సినిమాలో ముందుగా దివ్యభారతిని కథానాయికగా అనుకున్నారు.
అజయ్ దేవ్ గణ్ నటించిన ‘విజయ్ పథ్’ లో దివ్యభారతి ని తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆమె మరణంతో టబు ను తీసుకున్నారు.
కర్తవ్య సినిమాలో దివ్యభారతి మరణంతో జుహీ చావ్లాను తీసుకున్నారు.
అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘లాడ్లా’లో ముందుగా దివ్యభారతిని కథానాయికగా అనుకున్నారు. ఆమె ఆకస్మిక మరణంతో శ్రీదేవి రంగంలోకి దిగాల్సి వచ్చింది.
దివ్యభారతి మరణంతో ‘ఆందోళన్’ మూవీలో మమతా కులకర్ణితో రీ ప్లేస్ చేసారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మొహ్రా’ సినిమాలో ముందుగా దివ్యభారతి ని తీసుకున్నారు. ఆమె అకాల మరణంతో రవీనాను తీసుకున్నారు.
సన్ని దేవోల్ హీరోగా నటించిన ‘అంగరక్షక్’ మూవీలో ముందుగా దివ్యభారతిని కథానాయికగా తీసుకున్నారు. కానీ దివ్యభారతి మరణంతో పూజా భట్ ను కథానాయికగా తీసుకున్నారు.