హై ప్రోటీన్ మంచూరియా.. జిమ్‌ చేసే వారికి వే ప్రోటీన్!

Dharmaraju Dhurishetty
Sep 18,2024
';

మిల్ మేకర్ లో ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది.

';

మిల్ మేకర్ లో ఉండే పోషకాలు రోజు వ్యాయామాలు చేసే వారికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా తక్షణ శక్తిని అందిస్తాయి.

';

మిల్ మేకర్ జిమ్‌కి వెళ్లేవారు తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అలసిపోకుండా ఉంటారు.

';

మిల్ మేకర్ తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం కూడా దృఢంగా తయారవుతుంది. దీంతో పాటు కండరాలు కూడా మెరుగుపడతాయి.

';

సోయా చంక్స్‌ను చాలామంది తినేందుకు ఇష్టపడరు. అయితే ఇలాంటి వారికోసం ఈరోజు మంచూరియన్ రెసిపీని పరిచయం చెయ్యబోతున్నాం..

';

మిల్ మేకర్ మంచూరియాకి కావలసిన పదార్థాలు: సోయా చంక్స్ (200 గ్రాములు), క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా తరిగినవి), కాల్చిన వెల్లుల్లి రెబ్బలు

';

కావలసిన పదార్థాలు: శనగపిండి, సోయా సాస్, చిల్లి సాస్, వెల్లుల్లి రేకులు, ఇంచుమించుగా అన్ని రకాల మసాలా దినుసులు (ధనియాల, పొడి, కారం పొడి, గరం మసాలా, ఉప్పు), నూనె

';

తయారీ విధానం..సోయా చంక్స్‌ను నానబెట్టడం: సోయా చంక్స్‌ను గోరువెచ్చటి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. ఇలా వేడి నీటిలో నానబెట్టి ఉంచడం వల్ల మృదువుగా తయారవుతాయి.

';

కూరగాయలను తరుగుట: క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

';

మరినేట్ చేయడం: నానబెట్టిన సోయా చంక్స్‌ను, తరిగిన కూరగాయలను, కాల్చిన వెల్లుల్లి రేణువులు, సోయా సాస్, చిల్లి సాస్, వెల్లుల్లి రేకులు, మసాలా దినుసులను ఒక బౌల్‌లో కలిపి బాగా కలపాలి.

';

కోటింగ్ చేయడం: కలిపిన మిశ్రమాన్ని శనగపిండిలో బాగా కోట్ చేయాలి.

';

వేయించడం: మీల్ మేకర్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కోటింగ్ చేసిన మిశ్రమాన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

';

సర్వ్ చేయడం: వేయించిన మంచూరియాను వేడి మీద ఉండగానే సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story