టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్.
తేజ దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా లక్ష్మీ కళ్యాణం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్.
రాజమౌళి మగధీర చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుగులో ఎన్నో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఈమధ్య ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచిలోని వివాహం చేసుకొని ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కాజల్ మరోసారి సినిమాలలో రాణించడానికి సిద్ధమయ్యింది.
ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ పలు చిత్రాలలో కనిపించిన కాజల్.. సత్యభామ, ఇండియన్ 2 లాంటి చిత్రాలతో త్వరలో మన ముందుకి రానుంది.
తాజాగా కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆమె ఫ్యామిలీ ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.