రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక.. ? పెళ్లి కొడుకు అతడేనా..?
నిహారిక విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డులకు ఎక్కింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
నిహారిక మెగా డాటర్‌గా తనదైన యాక్టింగ్‌తో పాటు ఆటిట్యూట్‌తో ఆడియన్స్ లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువ అయిందనే చెప్పాలి.
నిహారిక.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు.
ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది.
ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది.
ఇకపై వెబ్ సిరీస్ లు కాకుండా.. డైరెక్ట్ సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన ఫ్యామిలీకి చెందిన హీరోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.