హాట్ ఫోట్ షూట్స్‌తో వానా కాలంలో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోన్న రాశీ ఖన్నా..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి స్పీడ్ మీదుంది. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లలో కూడా అలరిస్తోంది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.
రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.
తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి సరైన ఛాన్సులు దక్కలేదు.
జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.
ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నా ఆశలపై నీళ్లు చల్లింది. అందుకే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది.
ఆ మధ్య దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రాశీ ఖన్నా వివరణ ఇస్తూ.. తాను సౌత్ సినీ ఇండస్ట్రీపై కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది.
భాష ఏదైనా సినిమా ఏదైనా.. తాను ప్రతి సినిమాపై తనకు గౌరవం, మర్యాద ఉందన్నారు. దయచేసి తనపై వస్తోన్న దుష్ప్రచారాన్ని ఆపమంటూ వేడుకుంది.
2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్' మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా
రాశీ ఖన్నా కెరీర్‌లో జిల్, జోరు, సుప్రీమ్, జై లవకుశ, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, మంచి రోజులు వచ్చాయి వంటి నటించి అదరగొట్టింది.
రాశీ ఖన్నా ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అనే సెంటిమెంట్ ఉంది. ఇందులో వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ' ఒక్కటే హిట్ అందుకుంది. గోపీచంద్‌తో 'జిల్', సందీప్ కిషన్‌తో జోరు, రామ్ పోతినేని 'శివమ్', విజయ్ దేవరకొండతో చేసిన
రాశీ ఖన్నా ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అంతేకాదు అందులో తనకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యింది.