అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈమధ్యే జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చారు.
ప్రస్తుతం శోభిత సినిమాల్లో నటిస్తున్నారు. ఈ బ్యూటీకి బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
శోభిత త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది. అయితే చైతుతో ఎంగేజ్ మెంట్ తర్వాత ఆమె గురించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. పుష్పలోని ఐటెం సాంగ్ చేసింది సమంత. ఈ ఐటెం సాంగ్ వారిద్దరి మధ్య చిచ్చు పెట్టిందన్న వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా శోభిత దూళిపాళ్లకు కూడా బాలీవుడ్ నుంచి ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందన్న న్యూస్ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ డాన్ 3 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.
ఈ మూవీలో గ్లామరస్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సాంగ్ లో శోభిత నటిస్తే బాగుంటుందని ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే శోభితా ఈ విషయంపై ఎలా స్పందించారన్న విషయం బయటకు రాలేదు. ఒకవేళ శోభిత అంగీకరిస్తే..అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతందన్న చర్చ షురూ అయ్యింది.