బాలీవుడ్ లో శ్రీదేవి కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హిమ్మత్ వాలా’. తెలుగులో కృష్ణ, జయప్రద హీరో, హీరోయిన్స్ గా నటించిన ‘ఊరుకు మొనగాడు’ చిత్రానికి రీమేక్. హిందీలో శ్రీదేవికి తొలి బ్లాక్ బస్టర్. ఈ సినిమా తర్వాత శ్రీదేవి వెనుదిరిగ
యశ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘చాందిని’ మూవీ అప్పట్లో పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉటాయి.
యశ్ చోప్రా దర్శకత్వంలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో తల్లి కూతుళ్లుగా శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసింది.ఈ సినిమా హిందీలో బెస్ట్ లవ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు మన దేశంలో బెస్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఈ సినిమాకు చోటు దక్కింది.
జ్ఞాపక శక్తిని కోల్పోయిన ఓ స్త్రీ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో బాలు మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘వసంత కోకిల’గా తెరకెక్కిన ఈ సినిమా హిందీలో అదే తారాగణంతో రీమేక్ చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇది ఫాంటసీ ఫీచర్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో శ్రీదేవి నాగదేవత పాత్రలో జీవించింది. ఈ సినిమా కూడా బాలీవుడ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ కమ్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
పెళ్లైన 15 యేళ్ల తర్వాత శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. విదేశాల్లో స్థిరపడిన ఓ గృహిణి ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడిందనే నేపథ్యంలో తెరకెక్కింది.
నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్’. ఈ సినిమాలో ఓ సగటు తల్లి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాలో నటనకు శ్రీదేవి జాతీయ ఉత్తమ నటి అవార్డు చనిపోయిన తర్వాత లభించడం విశేషం.