చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే ఆ సమయంలో అంజీర్ తినడం మంచిది
అంజీర్‌లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, జింక్, ఐరన్, మెగ్నీషియం ఆరోగ్యానికి చాలా మంచివి.
అంజీర్ తినడం మహిళలకు చాలా అవసరం. ఇందులో ఉండే పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు హార్మోన్ అసమతుల్యత, పోస్ట్ మెనోపాజ్ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి.
అంతేకాకుండా అంజీర్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలావరకూ తగ్గుతాయి
నీళ్లలో నానబెట్టిన అంజీర్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి.
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి రాత్రంతా నానబెట్టిన అంజీర్ తిన్పిస్తే మలబద్ధకం వంటి సమస్య కూడా పోతుంది
అంజీర్‌లో ఉండే కాల్షియం ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంజీర్‌లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
నానబెట్టిన అంజీర్‌ను రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.