రోజు మనం ఉదయాన్నే ఇడ్లీ, దోస, పొంగల్.. ఉప్మా లాంటి ఎన్నో టిఫిన్స్ తింటూ ఉంటాము.
అయితే ఇవన్నీ దాదాపు బియ్యంతో లేదా బియ్యం పిండితో చేసిన టిఫిన్స్.
వీటిలో కార్బోహైడ్రేట్స్ తప్ప పీచు పదార్థం అస్సలు ఉండదు.
అందువలన ఈ టిఫన్స్ వల్ల మన షుగర్ లెవెల్స్.. ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.
అంతేకాదు శరీరంలో క్యాలరీలు చేరి.. కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది.
మరి టిఫిన్స్ లో బెస్ట్ టిఫన్ ఏమిటి అంటే.. పెసరట్టు.
పెసరట్టులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ టిఫన్ మనకు చాలా మేలు చేస్తుంది.
పెసరట్టు కూడా నెయ్యి.. నూనెతో కాకుండా.. మీగడతో వేసుకుని.. అల్లం చట్నీ తో తింటే ఎంతో మంచిది.