పేదవాడి బాదంగా గుర్తింపు తెచ్చుకున్న పల్లీలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించడమే కాకుండా కొన్ని రకాల జబ్బులను కూడా దూరం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ బి6, రైబోఫ్లేవిన్ , కాపర్, థయామిన్, జింక్, పొటాషియం, మాంగనీస్, సెలీనియం , ఐరన్, కాల్షియం మంటి పోషకాలు లభిస్తాయి
వేరుశనగ విత్తనాలు బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి బీపీ పెరగకుండా కాపాడుతుంది.
పల్లీలలో వుండే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె కండరాల పనితీరును మెరుగుపరచడమే కాదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెపోటు రాకుండా నివారిస్తుంది.
100 గ్రాముల పల్లీల లో 560 క్యాలరీల శక్తి, 45 గ్రాముల కొవ్వు, 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది..
ఉడకబెట్టిన వేరుశనగలు తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది.