గుడ్లు ప్రోటీన్‌కి అద్భుతమైన మూలం.. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఎల్లప్పుడు నిండుగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియత్రణలో ఉంటాయి.
బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఆల్పాహారంలో తీసుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఓట్స్‌లో ఫైబర్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి.
గ్రీక్ పెరుగు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు నిండుగా ఉంచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల కూడా చక్కెర పరిమాణాలు స్థిరంగా ఉంటాయి.
చీయా గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలుతో పాటు ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
తాజా పండ్లు, గింజలు, గ్రీక్ పెరుగుతో తయారు చేసిన సలాడ్స్ కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలును నియంత్రించేందుకు ప్రభావంగా పని చేస్తాయి.
తాజా పండ్లు, కూరగాయలు, గింజలతో తయారు చేసిన స్మూతీలను తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.