Ginger water

అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం తురిమినది వేసి 10 నిమిషాలు నానబెట్టి, ఆపై వడగట్టి తాగండి.

';

Mint water

పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి 5 నిమిషాలు నానబెట్టి, వడగట్టి తాగడం చాలా మంచిది.

';

lemon Water

నిమ్మ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు, జీర్ణక్రియను మెరుగుపరడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తాగండి.

';

Apple Cider Vinegar

ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బెల్లీ ఫ్యాట్‌ కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి భోజనానికి ముందు తాగండి.

';

Green tea

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగండి.

';

coconut water

కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా కొవ్వును బర్న్‌ చేస్తుంది. రోజుకు 2-3 కప్పుల కొబ్బరి నీరు తీసుకోవడం చాలా మంచిది.

';

Tomato juice

టమాటో జ్యూస్‌లో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ టమాటో జ్యూస్ భోజనానికి ముందు తాగండి.

';

Cranberry juice

క్రాన్‌బెర్రీ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఒక గ్లాస్ క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగండి.

';

VIEW ALL

Read Next Story