Cashew Side Effects: జీడిపప్పుతో దుష్పరిణామాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా, పూర్తి వివరాలు మీ కోసం
జీడిపప్పును సూపర్ ఫుడ్ అంటారు. ఆరోగ్యానికి చాలా లాభదాయకం. కానీ అతిగా తింటే ఏమౌతుందో తెలుసా
జీడిపప్పు వాస్తవానికి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె వ్యాధుల్నించి కాపాడుతుంది
జీడిపప్పులో చాలా రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీ అందిస్తాయి.
అయితే జీడిపప్పు అతిగా తినడం వల్ల దుష్పరిణాలు కలుగుతాయి. స్వెల్లింగ్, మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
జీడిపప్పుతో ఎలర్జీ ముప్పు ఉంటుంది. కొంతమందికి జీడిపప్పు పడదు. చర్మంపై ఎలర్జీ లక్షణాలు కన్పించవచ్చు
గర్భిణీ మహిళలు జీడిపప్పుని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అతిగా తీసుకోకూడదు
ఒకవేళ మీకు హేజిల్‌నట్, బాదం, ఇతర డ్రై ఫూట్స్‌తో ఎలర్జీ ఉంటే జీడిపప్పు కూడా ఎలర్జీ కల్గించవచ్చు
కొంతమందికి నట్స్ ఎలర్జీ ఉంటుందియ మీక్కూడా ఆ పరిస్థితి ఉంటే జీడిపప్పు తినే ముందు ఆలోచించుకోవాలి
జీడిపప్పును సరైన పద్దతిలోనే వినియోగించాలి. అప్పుడే ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది