శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్ లోపిస్తే వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం.
ఒక వ్యక్తి తీసుకునే ఆహారంలో మార్పులు వస్తే శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇందుకోసం పోషకాహారం డైట్లో చేర్చుకోవాలి.
శరీరంలో జింక్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపిస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.
శరీరంలో జింక్ లేకపోవడం వల్ల సహాజమైన వెంట్రుకలు పెరగడంలో ఇబ్బంది ఉంటుంది. దీని లోపంతో జుట్టు రాలుతుంది.
జింక్ లోపం వల్ల ఆకస్మిక బరువు తగ్గుతారు. శరీరంలో ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
జింక్ లోపం ఉంటే అది కళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణం దృష్టి సమస్య వస్తుంది.
శరీరంలో జింక్ లోపం వల్ల రక్తస్రావం ఆగదు. దీంతో గాయం ఎక్కువ కాలం నాయం కాదు. ఇన్ఫెక్షన్ ప్రమాదం పెంచుతుంది.
జింక్ లోపించినట్లయితే పుట్టగొడుగులు, వేరుశనగలు, పెరుగు, గుడ్డు, నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తింటే జింక్ లోపం నయం అవుతుంది.