చాలామంది ఆవు నెయ్యి వాడాలా లేక గేదె నెయ్యి వాడాలా అని తెలియక తికమక పడుతుంటారు.
ఆవు గేదె నెయ్యి ఈ రెండింటిలో రుచి విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. చూడటానికి కూడా రెండు ఒకేలా ఉండవు.
ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది అలాగే పలుచగా ఉంటుంది. గేదె నయ్యి తెల్ల రంగులో ఉంటుంది. పూసలు పూసలుగా ఏర్పడుతుంది.
గేదె నెయ్యితో పోల్చి చూస్తే ఆవు నెయ్యి ఆయుర్వేద పరంగా చాలా ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు.
అయితే రుచి విషయంలో ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి చాలా రుచికరంగా ఉంటుంది. దీంతో పిల్లలు తినేందుకు ఇష్టపడుతుంటారు.
అయితే పిల్లలకు ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి తినిపిస్తే బక్కగా ఉన్నవారు త్వరగా లావు అవుతారని వైద్య నిపుణులు చెప్తున్నారు.
అయితే ఆవు నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని ఇది అరగడానికి తేలికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆవు నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మిమ్మల్ని అనేక జబ్బుల నుంచి కాపాడుతాయి.
అయితే గేదె నెయ్యిలో ప్రోటీన్లు కొవ్వు శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది పిల్లలకు త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
అయితే ఆవు నెయ్యిలో పిల్లలకు ఏది వాడాలి అని ఆలోచిస్తున్నారా? దీనికి మాత్రం పరిష్కారం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.