త్వరగా చికెన్ ఫ్రై చేయడం కోసం.. ముందుగా ఒక కిలో చికెన్ తెచ్చుకొని.. బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఈ చికెన్ లో.. ఒక స్పూన్ ఉప్పు.. ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల మిరపపొడి వేసి కలుపుకోండి.
ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని.. కలుపుకోండి.
ఈ మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు రెండు ఎర్రగడ్డలు, నాలుగు మిరపకాయలు తరుక్కోండి.
స్టౌ పైన పాన్ పెట్టుకొని.. ఒక స్పూన్ నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేసుకొని.. అందులో తిరగమాత వస్తువులు, రెండు తరిగిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి.
ఇప్పుడు ముందుగా మారినే చేసుకున్న చికెన్ ని వేసుకొని.. బాగా కలుపుకొని పాన్ పైన మూత పెట్టేయండి. దించుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ.