సెప్టెంబర్ 22న డాటర్స్ డే..ఈ అందమైన కొటెషన్స్ తో మీ చిట్టి తల్లికి మనసారా విషెస్ చెప్పండి.
ఆడపిల్ల లేని ఇళ్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే..అందుకే ప్రతి ఇంటా ఉండాలి ఆడపిల్ల, చిరునవ్వుల వెన్నెల విరియాలి ఇంటింటా..హ్యాపీ డాటర్స్ డే
కూతురంటే కష్టం కాదని..కూతురంటే వజ్రం కన్నా ఎక్కువని..నా చిట్టి తల్లి చిరునవ్వులో స్వర్గం కూడా కనిపిస్తుంది. హ్యాపీ డాటర్స్ డే చిట్టితల్లి
పుట్టింటికి యువరాణులు, మెట్టినింటికి మహారాణులు అయిన ఆడపిల్లలూ..మీకు హ్యాపీ డాటర్స్ డే
కూతురు అంటే కూడికల, తీసివేతల లెక్క కాదు..ఆడపిల్ల అంటే మన ముంగిట్లో తులసి మొక్క
నువ్వు నా బలం..నువ్వే నా బలహీనత..నీ చిరునవ్వులు చాలు చిట్టి తల్లి..నా బాధను తరిమేందుకు..నీ ముద్దు మాటలు చాలు నాకష్టాన్ని మరిపించేందుకు..ఈ జీవితంలో దేవుడిచ్చిన మరో అమ్మ నీవే..హ్యాపీ డాటర్స్ డే తల్లి
పువ్వు ఈ సృష్టిలో అందమైంది.. నా ద్రుష్టిలో అందమైంది నా చిట్టి తల్లి చిరునవ్వు
నా గుండెల్లో పదిలపరచుకున్న నీ ప్రతిరూపం..ప్రతిరోజూ నా కర్తవ్యం జ్నాపకం చేస్తూనే ఉంటుంది. హ్యాపీ డాటర్స్ డే బంగారు తల్లి
కూతురంటే అందమైన అనుబంధం..అంతులేని అనురాగం..మరపురాని జ్నాపకం..హ్యాపీ డాటర్స్ డే చిన్నితల్లి.