వర్షాకాలం ప్రారంభమైపోయింది. దాంతో పాటే డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంటుంది. అందుకే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే

';

నీళ్లు నిల్వ ఉండకూడదు

వర్షాకాలంలో సాధారణంగా నీళ్లు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందుతుంటాయి. దాంతో డెంగ్యూ ముప్పు పెరుగుతుంది. అందుకే నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి

';

బట్టలు పూర్తిగా ధరించడం

దోమల్నించి రక్షించుకునేందుకు బట్టలు పూర్తిగా ధరించాలి. షార్ట్ బట్టలకు దూరంగా ఉండాలి.

';

నీళ్లు నిలిచిపోవడం

నిలిచిపోయిన నీళ్లలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందేందుకు అవకాశముంటుంది. అందుకే టైర్లు, గమేలాలు, పశువుల నీటి తొట్టెలు వంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.

';

బయటకు వెళ్లేటప్పుడు

వర్షాకాలంలో ఉదయం లేదా సాయంత్రం బయటికి తిరగాడానికి వెళ్లాలంటే ఫుల్ కోట్ అండ్ షూస్ మెయింటైన్ చేయాలి. తద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి.

';

తలుపులు, కిటికీలు క్లోజ్ చేయడం

వర్షాకాలంలో డెంగ్యూ నుంచి రక్షించుకునేందుకు ఇంట్లో తలుపులు, కిటికీలు సాయంత్రం వేళ మూసి ఉంచాలి. తద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి

';

దోమ తెరలు

వర్షాకాలంలో దోమల్ని కాపాడుకునేందుకు దోమ తెరలు వినియోగించడం మంచిది.

';

క్రీమ్ రాసుకోవడం

మార్కెట్‌లో దోమల్ని పారద్రోలే క్రీమ్ లభిస్తుంది. ఈ క్రీమ్‌ను చేతులు, కాళ్లకు రాసుకోవడం మంచిది

';

VIEW ALL

Read Next Story