షుగర్ పేషెంట్స్ కి.. డయాబెటిక్ కి బై బై చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు..?అయితే ఒక జ్యూస్టో అది జరుగుతుంది అని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి.
ఇందుకోసం ఏమి చేయాలంటే బిళ్ల గన్నేరు ఆకులను తీసుకొచ్చుకుంటే చాలంట. ఈ ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి. వీటిని ఒక రెండు రోజులపాటు బాగా ఎండబెట్టికోవాలి.
ఆ తరువాత పొడిలా చేసుకుని.. ప్రతిరోజూ షుగర్ లేని ఏదైనా పండ్ల రసంలో ఒక టీస్పూన్ పొడిని కలుపుకొని తీసుకోవచ్చు.
ఈ పొడి రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
జ్యూస్ తాగకూడదు అనుకుంటే..ప్రతిరోజూ మూడ బిళ్ల గన్నేరు ఆకులను నమలవచ్చు.
అంతేకాదు ఈ బిళ్ల గన్నేరు పువ్వులను నీటిలో వేసి మరిగించి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇవేవీ చేసినా షుగర్ స్థాయి తగ్గడం ఖాయం.
గమనిక: పైన చెప్పినవి కేవలం ఆరోగ్యం నిపుణులు, అధ్యయనాల ప్రకారం చెప్పిన సమాచారం మాత్రమే. ఏవైనా పాటించే ముందు ముందుగా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమమైన పని.