డయాబెటిక్ పేషం పండ్లు తినడం మంచిదే అంటారు కొంతమంది. అయితే అలా అని.. అన్ని పండ్లు మాత్రం తినకూడదు. ముఖ్యంగా మామిడి పండ్లు డయాబెటిక్ పేషెంట్స్.. అస్సలు తినకూడదు..
మామిడి పళ్ళు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. మామిడిపళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఎటువంటి వారైనా సరే తప్పకుండా ఒక పండైన తినాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనసు.. చంపుకోలేక మామిడి పండ్లను తింటూ ఉంటారు.
అయితే సీజనల్ పండు కాబట్టి అతిగా తింటే మాత్రం డయాబెటిక్ పేషెంట్లకు మరింత ప్రమాదకరమని వైద్యలు హెచ్చరిస్తున్నారు.
మామిడి పండు గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా కలిగి ఉంటుంది. మామిడి పండులో 50 నుంచి 53 వరకు ఉంటుంది.ఈ పండ్లను షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ఉత్తమం.
మామిడి పండు తినాలి అనుకుంటే,పగటి సమయంలో తినడమే ఉత్తమం.ఎందుకంటే ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ ను కరిగించే శక్తి పగటిపూట ఎక్కువ..
మామిడి పండ్లను రెండు ముక్కల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.మరియు జ్యూస్ రూపంలోను,చక్కర వేసిన ముక్కలు అసలే తీసుకోకూడదు.
ఇందులో ఉన్న షుగర్స్ రక్తంలోకి నేరుగా కలిసిపోయి మధుమేహాన్ని పెంచుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తూ మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.