డైటింగ్ అనేది ఎల్లప్పుడూ మంచిది కాదు. ఒకవేళ తగ్గాలి అని డైటింగ్ చేసిన.. అందుకు తగిన నియమాలు పాటించడం ఎంతో అవసరం.
ముఖ్యంగా బరువు తగ్గాలని ఎంతోమంది ఉదయాన్నే టిఫిన్ తినడం మానేస్తూ ఉంటారు.
అయితే మన పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది.. ‘ఉదయాన్నే టిఫన్ రాజు లాగా తినండి.. మధ్యాహ్నం మనిషిలా తినండి.. రాత్రిపూట బిక్షగాడిలా తినండి’
అంటే మనం ఉదయాన్నే తినే టిఫిన్ మన ఆరోగ్యానికి ఎంతో పనికొచ్చేది.
మనం రోజంతా కష్టపడే దానికి.. శరీరానికి కావలసిన ప్రోటిన్ అంతా ఉదయాన్నే తినే టిఫిన్ వల్లే వస్తుంది.
అలాంటిది ఉదయాన్నే టిఫిన్ మానేస్తే.. దానివల్ల అనారోగ్య సమస్యలు తప్ప బరువు తగ్గే ఛాన్సే లేదు. అంతేకాకుండా ఉదయాన్నే టిఫిన్ తినకపోవడం వల్ల గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది.
గమనిక: పైన చెప్పిన సమాచారం అధ్యయనాలు..ఆరోగ్యా నిపుణుల సలహాల. మెరకు రాసినవే. జీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.