Gastric Problem: ఇదొక్కటి చేస్తే చాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మళ్లీ జీవితంలో రాదు

';

గ్యాస్ట్రిక్ సమస్య

చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒకటి. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గాలంటే ఆహార అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

';

చిన్న చిన్న భోజనాలు

చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటారు. కానీ ఒకేసారి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు 5 నుంచి 6 సార్లు చిన్న మొత్తంలో తినాలని సూచిస్తున్నారు.

';

మసాలా ఫుడ్స్ కు దూరం

మసాలాలు అధికంగా ఉండే ఫుడ్స్ తింటే గ్యాస్ట్రిక్ సమస్య మరింత ఎక్కువవుతుంది. కాబట్టి మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

';

కొవ్వు ఆహారాలు

కొవ్వు ఆహారాలు జీర్ణించుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వీటిని తగ్గించుకోవడం మంచిది. వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా వంటి వాటిని దూరంగా ఉండాలి.

';

సిట్రిక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్

నిమ్మకాయలు, టమాటాలు, కాఫీ, టీ, కార్బొనేటెడ్ పానీయాలు కడుపులో ఆమ్లతను పెంచుతాయి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతాయి. వీటిని మానుకోవాలి.

';

పాల ఉత్పత్తులు

కొంతమందికి పాల ఉత్పత్తులు ఎసిడిటినీ పెంచుతుంటాయి. వీటిని తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు.

';

ప్రాసెస్ చేసిన కార్బొహైడ్రేట్లు

బిస్కెట్లు, బ్రెడ్, పాస్తా వంటి ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రెట్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యను తీవ్రం చేస్తాయి.

';

ఒత్తిడి

ఒత్తిడి అనేది గ్యాస్ట్రిక్ సమస్యను తీవ్రం చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.

';

ఇవి తినండి

పండ్లు, కూరగాయలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగండి. ఫైబర్ ఫుడ్స్ తీసుకోండి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story