ఈ ఆకు మీ జుట్టుకు ఓ వరం లాంటిది, హెయిర్ ఫాల్ సమస్యకు బ్రేక్
వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. దాంతో ప్రతి ఒక్కరూ తమ కేశాల గురించి ఆందోళన చెందుతుంటారు
జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు చాలా రకాల ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ ఏవీ సరైన ఫలితాలు ఇవ్వవు
అయితే ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే బిర్యానీ ఆకు ఈ సమస్యకు అద్భుతంగా చెక్ చెబుతుంది. హెయిర్ ఫాల్ సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది
బిర్యానీ ఆకుల నీళ్లు హెయిర్ ఫాల్ సమస్యకు చాలా ఉపయోగపడుతుంది. 2-3 బిర్యానీ ఆకుల్ని నీళ్లలో వేసి బాగా ఉడికించాలి.
ఈ నీళ్లు చల్లారిన తరువాత తలకు బాగా పట్టించి మాలిష్ చేసుకోవాలి. రాత్రంతా వదిలేయాలి.
బిర్యానీ ఆకుల పౌడర్ నిమ్మరసం కలిపి కేశాలకు రాసుకుంటే హెయిల్ ఫాల్ సమస్య తగ్గుతుంది.
అల్లోవెరా జెల్‌తో బిర్యానీ ఆకుల పౌడర్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు రాసి ఓ అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
బిర్యానీ ఆకుల్ని పైన చెప్పిన పద్దతుల్లో వాడి చూస్తే జుట్టు రాలడం చాలా త్వరగా తగ్గుతుంది. డేండ్రఫ్ సమస్య కూడా పోతుంది