మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునక్కాయను.. పాలతో కలిపి రుచికరమైన కర్రీ.. ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఒక కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసుకొని.. అర స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి చిటపటలాడించండి.
ఆ తర్వాత నాలుగు ఉల్లిపాయలను.. సన్నగా తరుక్కొని ఆ నూనెలో వేయండి.
ఉల్లిపాయల త్వరగా మగ్గాలంటే కొంచెం.. ఉప్పు చేర్చడం ఉత్తమం.
ఉల్లిపాయల గోధుమ రంగు..వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కట్ చేసిన మునక్కాయలను వేసి.. కొంచెం సేపు మగ్గనివ్వండి.
మునక్కాయలు మగ్గిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు పోయండి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసి.. మునక్కాయలు బాగా ఉడికే వరకు ముగించండి.
మునక్కాయలు బాగా మగ్గిన తర్వాత ఒక అర గ్లాసు పాలను చేర్చి.. ఒక ఐదు నిమిషాలు ఉంచండి.
అంతే ఎంతో రుచికరమైన పాలతో చేసిన మునక్కాయ కూర రెడీ. మునక్కాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల..ఇది బరువుని కూడా అదుపులో ఉంచుతుంది.