ఈ క్రమంలో మనం ఒక ఆకు తింటే.. అది మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది అన్న విషయం మీకు తెలుసా?
అది మరేదో ఆకు కాదు.. కరివేపాకు. ప్రాచీన కాలం నుండి కరివేపాకును ఎన్నో భారతీయ వంటకాలలో భాగం చేసుకున్నాము.
అంతేకాకుండా ఎన్నో ఔషధాల తయారీలో ఈ కరివేపాకులను వినియోగించడం మొదలుపెట్టాము.
ముఖ్యంగా ఖాళీపొట్టతో కరివేపాకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఉదయాన్నే కరివేపాకు తినడం వల్ల. జీర్ణ క్రియను మెరుగుపడుతుంది. ఇందువల్ల మనం త్వరగా బరువు తగ్గొచ్చు.
ప్రతిరోజు కరివేపాకులను ఖాళీ పొట్టతో నమిలి ఆ రసాన్ని తాగటం వల్ల జుట్టు.. కూడా బాగా పెరుగుతుంది.
కరివేపాకులో బీటా కెరాటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి మన వెంట్రుకల కుదుళ్లను ఎంతో గట్టిగా మారుస్తాయి.
అంతేకాకుండా ఖాళీపొట్టతో ఇలా కరివేపాకులను తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. ఇందువలన మధుమేహం అదుపులో ఉంటుంది.