ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పు పాయసం.. ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఒక గంట సేపు.. కప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి.
అవి నానిన తరువాత సగ్గుబియ్యాన్ని ఉడికించి.. పక్కన పెట్టుకోండి.
ఒక కుక్కర్లో.. మూడు స్పూన్ల నెయ్యి వేసి.. ఒక కప్పుడు పెసరపప్పును వేసి.. దోరగా వేయించుకోండి.
పెసరపప్పు వేగిన తర్వాత.. మూడు విజిల్లు ఉంచి.. స్టవ్ ఆఫ్ చేయండి.
తరువాత స్టవ్ ఆన్ చేసి ఆ ఉడికిన పెసరపప్పులో.. ఒక గ్లాసుడు పాలు పోసి ఉడికించండి. తరువాత ఉడకబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి.. ఐదు నిమిషాలు ఉడకనివ్వండి.
అందులోనే చక్కెర కానీ బెల్లం కానీ.. వేసుకొని ఉడికించండి..
చివరిగా వేయించిన జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే పెసరపప్పు పాయసం రెడీ