ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మంచిది. మరి అలాంటి క్యారెట్ తో హల్వా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
ముందుగా ఒక ఐదు క్యారెట్ లను.. చెక్కు తీసుకొని తురుముకోవాలి.
ఒక కడాయిలో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేడి.. చేసుకొని.. గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు ద్రాక్ష వేయించుకొని.. పక్కన పెట్టుకోవాలి.
ఆ కడాయిలోనే ఇంకొక స్పూను నెయ్యిని చేర్చుకొని.. ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ తురుముని అందులో వేసుకొని.. బాగా మగ్గనివ్వాలి.
క్యారెట్ బాగా మగ్గిన తర్వాత అందులో ఒక గ్లాసుడు పాలు పోసి.. ఉడికించాలి.
పాలు దగ్గర పడిన తర్వాత.. అందులో రుచికి సరిపడినంత చక్కెర..కొంచెం మిల్క్ మేడ్ వేసి ఉడికించండి.
అవన్నీ బాగా ఉడికిన తర్వాత.. వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని.. దించేయండి. అంతే టేస్టీ క్యారెట్ హల్వా రెడీ.