Herbal Hair Oil: కొత్తిమీర కట్ట లాంటి మీ జుట్టును వాలు జడలా మార్చే హెర్బల్ ఆయిల్ ఇదే

Bhoomi
Sep 18,2024
';

హెర్బల్ ఆయిల్

ప్రస్తుత ఆధునిక జీవితంలో కలుషితమైన ఆహారము కాలుష్యం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య పెరిగింది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే హెర్బల్ ఆయిల్ చక్కటి పరిష్కారం.

';

ఆముదం

కొబ్బరి నూనెలో ఆముదం కలిపి మీ వెంట్రుకలకు రాసుకుంటే జుట్టు మూలాల నుంచి బలంగా మారే అవకాశం ఉంటుంది.

';

నువ్వుల నూనె

కొబ్బరి నూనెలో నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుంటే మీ వెంట్రుకలు మూలాల నుంచి బలంగా ఒత్తుగా మారుతాయి.

';

ఆవు నెయ్యి

కొబ్బరి నూనెలో ఒక చెంచా ఆవు నెయ్యి కలిపి మీ తలకు రాసుకుంటే మీ వెంట్రుకలు బలంగాను నల్లగా ఒత్తుగాను తయారవుతాయి.

';

మందార పువ్వులు

కొబ్బరి నూనెలో మందార పువ్వులు కలిపి మరగబెట్టి ఆ నూనెతో మసాజ్ చేసుకుంటే మీ జుట్టు మూలాల నుంచి బలపడుతుంది.

';

ఉసిరికాయ పొడి

కొబ్బరి నూనెలో ఉసిరికాయ పొడి కలిపి తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు మూలాల నుంచి బలపడే అవకాశం ఉంది.

';

మెంతులు

కొబ్బరి నూనెలో మెంతులను వేసి కాగిన తరువాత ఆ నూనెను చల్లారిన అనంతరం తలకు మసాజ్ చేసుకున్నట్లయితే మీ వెంట్రుకలు బలంగా ఒత్తుగా మారుతాయి.

';

మర్రి ఊడలు

కొబ్బరి నూనెలో మర్రి ఊడలు వేసి 48 గంటల పాటు అలాగే ఉంచి ఆ నూనెను మీ తలపై మసాజ్ చేసుకుంటే మీ వెంట్రుకలు మర్రి ఊడల్లా పెరిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది.

';

కరివేపాకు

కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి ఆ నూనెను తలకు రాసుకున్నట్లయితే మీ వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా మారే అవకాశం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story