ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి తరచూ వచ్చే సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు.
ఖర్జూరాలలో విటమిన్ ఏ, విటమిన్ b6 , ఐరన్, కాల్షియం, మెగ్నీషియం , కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
ఖర్జూరంలో లభించే కాల్షియం దంతాలను, ఎముకలను, గోళ్ళ ను బలంగా మార్చడానికి, అలాగే ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడానికి, అలాగే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
ప్రతిరోజు ఖర్జూరాలను గర్భిణీ స్త్రీలు తినడం వల్ల విటమిన్ b6 పుష్కలంగా ఉంది. తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంగా ఉంచుతుంది. సుఖ ప్రసవం జరిగి రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి.
ఇందులో ఉండే విటమిన్ b6 మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పిల్లలు తినడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది
ఖర్జూరాలు తినడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్ లు దూరం అవుతాయి. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి.
మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు నానబెట్టిన ఖర్జూరాలు పరగడుపున తినాలి.