వేసవి దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్ చెరుకు రసం.
బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఎండలో తిరిగొచ్చి తాగితే మంచి ఉల్లాసం కలుగుతుంది.
కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులు చెరుకు రసం తాగొచ్చా లేదా అనే విషయంలో సందేహాలు ఉంటుంటాయి
వాస్తవానికి చెరుకు రసం ఎక్కువ తీపిగా ఉంటుంది.
అందుకే చెరుకు రసం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయంటారు
ఈ నేపధ్యంలో డయాబెటిస్ రోగులు చెరుకు రసం తాగవద్దని వైద్యులు సూచిస్తుంటారు.
కానీ ఒకవేళ రోగి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటే, ఆరోగ్యం సాధారణంగానే ఉంటే పరిమితంగా చెరుకు రసం తాగవచ్చు
అయితే ఇది అత్యంత తీపిగా ఉండే డ్రింక్ కావడంతో ఎక్కువ తాగడం మంచిది కాదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది.
అందుకే చెరుకు రసం తాగాలంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.