నిమ్మకాయ నీరు ఆరోగ్యపరంగా అత్యద్భుతమైందని చెప్పవచ్చు. ఒక్క గ్లాసు నిమ్మకాయ నీరు తాగితే చాలు 7 రకాల వ్యాధుల్ని దూరం చేయవచ్చు
వేసవి కాలంలో నిమ్మకాయ నీల్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదంలో నిమ్మకాయకు ఔషధంగా భావిస్తారు
నిమ్మకాయలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్, ఖనిజాలుంటాయి. ఇవి శరీరానికి ప్రయోజనం కల్గిస్తాయి.
నిమ్మకాయ నీళ్లు ఉదయం పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభదాయకం. నిమ్మకాయ నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగితే 7 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు.
వేసవిలో డీ హైడ్రేషన్ అతి పెద్ద సమస్యగా ఉంటుంది. నిమ్మ నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు
కడుపు సంబంధిత సమస్యలకు నిమ్మకాయ నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీని పెంచవచ్చు. తద్వారా సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు
నిమ్మకాయ నీళ్లు లివర్‌ను డీటాక్స్ చేస్తాయి. శరీరంలో విష పదార్ధాలను బయటకు తొలగించడంలో దోహదపడతాయి
రోజూ ఉదయం పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరం ఎనర్జటిక్‌గా ఉంటుంది.
కొంతమందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. ఈ సమస్యకు నిమ్మకాయ నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.