తామర ఆకుల నుంచి తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బల్ టీ. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
ఈ టీని ఎండిన తామర ఆకులతో తయారు చేస్తారు. మొదట చైనాలో ఈ టీని ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు ఆసియా అంతట ఫేమస్ అయ్యిది.
తామర ఆకుతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
తామర ఆకులతో తయారు చేసిన టీ తాగితే అందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
తామర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో వాపు, చికాకు తగ్గుతుంది.
తామర ఆకుల్లో జీవక్రియను పెంచేందుకు సహాయపడే పోషకాలు ఉన్నాయి. ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దారి తీస్తాయి.
తామర ఆకులతో తయారు చేసిన టీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తామర ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి గుండెను కాపాడుతాయి.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.