వేడి పాలల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను కలుపుకొని తాగితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం.
వేడి పాలలో అరటిపండు కలుపుకొని తిన్నట్లయితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది అరటిపండు లో ఉండే ఫాస్ఫరస్ వేడి వల్ల మీ పేగులను దెబ్బతీస్తుంది.
వేడి పాలలో తేనె కలుపుకొని తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.
వేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి పాలను తాగితే జీర్ణశక్తి దెబ్బతింటుంది.
వేడి పాలల్లో మామిడిపండు గుజ్జు కలిపితే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఇలాంటి పాలను తాగితే మీరు అజీర్తిని పొందే అవకాశం ఉంది.
వేడి పాలల్లో నిమ్మ జాతికి చెందిన పండ్లు కలపకూడదు. ఒకవేళ అలా కలిపితే పాలు విరిగి పోతాయి. వీటిని తాగితే మీరు అజీర్ణం బారిన పడే అవకాశం ఉంది.
పాలలో తేనె కలపాలి అనుకున్నప్పుడు గోరువెచ్చటి పాలల్లో తేనె కలపడం అత్యుత్తమమైన విధానంగా చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల పాలు తేనే కలిసిపోతాయి.
పాలలో పసుపు కలపాలి అనుకుంటే గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకోవడం మంచిది. అప్పుడు మీకు అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవు.
నిజానికి వేడి పాలను తాగడం కన్నా గోరువెచ్చటి పాలను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేడి పాలను తాగడం వల్ల కడుపులో ఉండే జీర్ణ రసాలు దెబ్బతింటాయని చెబుతున్నారు.