Spiny Gourd Benefits: కాకరకాయను మించిన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం ఇందులో. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్ల ఖజానా ఇది.
శరీరం ఎదుగుదలకు ప్రోటీన్లు చాలా చాలా అవసరం. ఇవి శరీరాన్ని ఎనర్జీ ఇస్తాయి.
శరీరానికి ప్రోటీన్లు కావాలంటే చికెన్ లేదా గుడ్లు తినమని వైద్యులు సూచిస్తుంటారు
కానీ కొన్ని ఆకుపచ్చని కూరగాయల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయని చాలామందికి తెలియదు.
ఆకాకరకాయ ఆయుర్వేదపరంగా అద్భుతమైంది. ఇందులో అన్ని రకాల వ్యాధుల్ని దూరం చేసే గుణాలున్నాయి.
ఆకారకాయను సాధారంగా స్వీట్ బిట్టర్ గార్డ్ అని కూడా అంటారు. స్పినీ గార్డ్ దీని పేరు. ఆయుర్వేదపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి
ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకాకరకాయ తింటే శరీరంలో ప్రోటీన్లు కొరత రాదు
ఇందులో శరీరం వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేసే రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అన్ని వ్యాధులకు చెక్ పెడుతుంది
ఇందులోని ప్రోటీన్లతో అధిక బరువు సమస్యకు చెక్ చెప్పవచ్చు.
ఆకాకరకాయను కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని నియంత్రించేందుకు సైతం వాడుతుంటారు