దుంపల్లో చిలగడదుంప కంటికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఈ కళ్లను ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. రాత్రిపూట చూపును మెరుగుపరుస్తుంది.
ఈ ఆకుకూరలో లుటీన్, జియాక్సంతిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి రెటీనాకు ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు హానికరమైన కాంతి నుంచి కళ్లను రక్షించడం.. కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఈ కూరగాయలో విటమిన్లు ఏ, సీ ఎక్కువ ఉంటాయి. విటమిన్ సీ కళ్లలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయం చేస్తుంది. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లుటీన్, విటమిన్ సీ, జింక్ కలిగి ఉంటాయి. బఠానీలు రెటీనా ఆరోగ్యానికి తోడ్పడతాయి. కంటిశుక్లం, వయస్సు-సంబంధిత కంటి సమస్యలను తగ్గిస్తాయి.
విదేశాల్లో ఎక్కువగా వాడే కాలే ఆకుకూర ఇప్పుడు మన స్థానికంగా కూడా వస్తోంది. ఈ ఆకుకూరలో విటమిన్లు ఏ, సీ, కే సమృద్ధిగా ఉంటాయి. కాలే ఆకుకూర రెటీనా ఆరోగ్యానికి చక్కగా పని చేస్తుంది. హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేయడంలో సహాయం చేస్తుంది.
క్యారెట్‌లో బీటా-కెరోటిన్, విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కంటి దృష్టికి కీలకం. బీటా-కెరోటిన్ రాత్రి అంధత్వాన్ని నివారిస్తుంది. మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ కూరగాయలో విటమిన్లు సీ, కె, లుటీన్ అధికంగా ఉంటాయి. బ్రస్సెల్స్ స్పౌట్స్ ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారిస్తుంది.
ఈ కూరగాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, లుటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు కళ్లను రక్షిస్తాయి. వయస్సు-సంబంధిత కంటి సమస్యలను తగ్గిస్తాయి.