ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందానికి చాలా మంది ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తలనొప్పి తగ్గేందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నవారు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
దాల్చన చెక్కను ఉపయోగించడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. నీటిలో దాల్చిన పొడి వేసి నుదుటిపై రాసుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
తలనొప్పి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ద్రాక్ష పండుతో తయారు చేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.