Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే ఈ 5 ఆకులు నమిలితే చాలు
ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది
వాస్తవానికి యూరిక్ యాసిడ్ సమస్య వృద్ధుల్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ ఎదురవుతోంది.
రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువైనప్పుడు కీళ్లు, ఎముకల్లో నొప్పి పుడుతుంది
యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది
యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించేందుకు బెస్ట్ ఆప్షన్ ఆకు కూరలు తరచూ తినడమే
పుదీనాలో ఐరన్, పొటాషియం, ఫోలేట్ అధికంగా ఉంటాయి. దాంతో శరీరం నుంచి యూరిక్ యాసిడ్ సులభంగా బయటకు పోతుంది
మునగాకు రోజూ నమిలి తింటే కిడ్నీ, యూరిన్ సమస్యలు దూరమౌతాయి. దాంతోపాటు సీరమ్ క్రియేటినిన్ , యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. దాంతో యూరిక్ యాసిడ్ కారణంగా తలెత్తే నొప్పులు దూరమౌతాయి.
రోజూ తులసి ఆకులు, మిరియాల పౌడర్ తింటే యూరిక్ యాసిడ్ సమస్య ఇట్టే తగ్గిపోతుంది
పాన్ ఆకులు నమిలి తినడం వల్ల శరీరంలో ప్యూరిన్ సరిగ్గా జీర్ణమౌతుంది. దాంతోపాటు శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి.