ప్రస్తుత తరం వారికి బరువు.. తగ్గదమనేది ప్రధానమైన సమస్య. మరి అలాంటి వారి కోసమే.. ఈ ఓట్స్ ఇడ్లీ.
ఈ టిఫిన్ తో క్యాలరీలను నియంత్రించవచ్చు.. ఓట్స్ ఇడ్లీ. బరువులు నియంత్రించడంలో ఓట్స్ ఎంతో ఉపయోగపడతాయి.. అలాంటి ఓట్స్ ని ఎన్నో రకాలుగా టేస్టీగా చేసుకోవచ్చు. అలాంటిదే మన ఓట్స్ ఇడ్లీ.
ముందుగా ఒక కడాయిలో కప్పు ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకొని.. పక్కన పెట్టుకోవాలి.
తరువాత అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేయించుకొని.. పక్కన పెట్టుకోవాలి.
ఓట్స్ ని మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో వేయించుకున్న.. బొంబాయి రవ్వను.. ఓట్స్ పౌడర్ ను బాగా కలుపుకోవాలి.
తరువాత ఒక కప్పు పెరుగును వేసి.. బాగా కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు, రెండు సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరుగుకున్న.. పెద్ద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి.
చివరిగా కొంచెం సోడా ఉప్పును వేసుకోండి. ఒక కడాయిలో నీరు బాగా వేడి చేసుకుని..ఈ మిశ్రమాన్ని ఇడ్లీల పాత్రలో.. ఇడ్లీల లాగా పోసుకొని.. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఇడ్లీ రెడీ