ఆపిల్ శరీరానికి అవసరమైన విటమిన్లు అందిస్తుంది. అందుకనే రోజు ఒక ఆపిల్ తినడం ఎంతో ఉత్తమమైన పని.
ఉదయాన్నే ఆపిల్ తినడం శరీరానికి చురుకుదనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శరీరానికి కావలసిన మితమైన క్యాలరీలు అందిస్తుంది.
ఆపిల్లో పుష్కలంగా ఉండే ఫైబర్.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
టిఫిన్ బదులు ఆపిల్ తినడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఇది తక్కువ కాలరీలతో కూడి ఉండటం.. వలన బరువు పెరగడం అడ్డుకుంటుంది.
రోజూ ఉదయాన్నే ఆపిల్ తినడం.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను మన దరికి చేరనివ్వదు.
కాబట్టి టిఫిన్ బదులు ఆపిల్ తినడం మీ శరీరానికి ఆరోగ్యకరమైన మార్పులను తీసుకొస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.