షుగర్ బాధితులు ఏ ఇడ్లీ తినాలి? సమాధానం ఇదే!
బియ్యంతో చేసిన ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇడ్లీ కొంత మందికి నచ్చదు. కానీ అయిష్టంగానే తినాల్సి వస్తుంది. ఇడ్లీ చేసే మేలు తెలుసుకుంటే మీ ఆహారంలో ఇడ్లీని తప్పనిసరిగా చేసుకుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇడ్లీ తినవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే వైద్యులు ఇడ్లీ తినే విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు.
ఇడ్లీలో ఉండే వైట్ రైస్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇడ్లీలో ఉండే అన్నం, పప్పు ఈ రెండు పదార్థాల్లో స్టార్చ్ అత్యధికంగా ఉంటుంది.
రైస్ ఇడ్లీ తినడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులను ప్రభావితం చేస్తాయి.
తెల్ల బియ్యం బదులు రాగులు, మిల్లెట్ మొదలైన వాటితో ఇడ్లీ తినవచ్చు.
ఇది కేవలం సమాచారం అందించడం కోసం అందిస్తున్నాం. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.