హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సహా వైశాల్యంలో మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉంది. ఈ విమానాయశ్రం దాదాపు 5500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏరియా వైజ్ గా చూస్తే మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఇదే.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దాదాపు 5106 ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంది. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్స్ లలో ఇది ఒకటి.
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం.. కర్ణాటక రాజధాని బెంగళూరులో దాదాపు 4 వేల ఎకరాల్లో ఈ విమానాశ్రయం విస్తరించి ఉంది. ఏరియా వైజ్ గా మన దేశంలో 3వ అతిపెద్ద విమానాశ్రయం.
మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర గోవాలో ఉంది. దాదాపు 2132 ఎకరాల్లో ఈ ఎయిర్ పోర్ట్ విస్తరించి ఉంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్నఈ విమానాశ్రయం.. 1640 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది తూర్పు భారత దేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఇదే. దేశంలో రద్దీగా ఉండే వి
బిర్సా ముండా విమానాశ్రయం..జార్ఖండ్ రాజధాని రాంచీలో కొలువై ఉంది. ఈ ఎయిర్ పోర్ట్ 1568 ఎకరాల్లో విస్తరించి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఇది ఒకటి.
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో దాదాపు 1500 ఎకరాల్లో విస్తరించి ఉంది. భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి.