యోగ ఆసనాలు చేస్తే సులువుగా బరువు తగ్గుతారు. మీరు ప్రయత్నించండి.
యోగ అనేది భారతీయ సంప్రదాయ పద్ధతి. భారత వైద్యశాస్త్రంలో యోగకు విశేష ప్రాధాన్యం ఉంది.
యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మికత వాతావరణం పెంపొందుతుంది.
అంతేకాకుండా బరువు తగ్గేందుకు యోగా కూడా దోహదం చేస్తుంది.
యోగాలోని అన్ని ఆసనాలు శరీరాన్ని కదిలించి క్యాలరీలు కరిగించి బరువు తగ్గడానికి కారణమవుతుంది.
2015 నుంచి ప్రతియేటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్ “యోగ ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ”
యోగ నిత్యం చేయడం శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
యోగ ద్వారా ప్రపంచానికి భారతీయ సంస్కృతి గొప్పతనం తెలుస్తోంది.
యోగ అనేది వయసుతో సంబంధం లేనిది. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు.