Delhi Pollution: ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో కాలుష్యం ప్రమాదంగా మారింది. ఎంతంటే రోజుకు 49 సిగరెట్లు తాగినంత పొగ ఊపిరితిత్తుల్లో చేరుతోంది
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కాలుష్యం పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది.
ఈ విషపూరిత గాలుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతోంది. కళ్లలో విపరీతమైన మంట ఉంటోంది
ఢిల్లీలో ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1000 దాటేసింది
ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో కూడా ఏక్యూఐ పెరిగింది.
ఢిల్లీలో పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే రోజుకు 49 సిగరెట్లు తాగినంత స్థాయిలో కాలుష్యం చేరింది.
బయట స్మాగ్ ఉంటే మార్నింగ్ వాకింగ్ చేయవద్దు. ఇది ప్రమాదకరం
రోజూ గోరు వెచ్చని నీళ్లే తాగాల్సి ఉంటుంది
దుమ్ము ధూళి ఉండే ప్రాంతాల్లో వెళ్లవద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పకుండా ధరించాలి
మీ ఇంటి చుట్టూ పొగ, దుమ్ము కన్పిస్తే వెంటనే నీళ్లు పిచికారీ చేయాలి