మన దేశ ప్రధాని మోడీని కంటికి రెప్పలా కాపాడే SPG కమాండోలకు నెలసరి జీతం ఎంతో తెలుసా..

TA Kiran Kumar
Aug 14,2024
';


స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అనేది భారత ప్రధాన మంత్రిని కంటికి రెప్పలా కాపాడే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ.

';


1988లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన SPG ప్రధానమంత్రికి భద్రతను పర్యవేక్షిస్తూ వస్తోంది.

';


SPG కమాండోలు అప్ గ్రేడెడ్ ఆయుధాలను కలిగి ఉంటారు. మరియు ప్రధాని రక్షణ కోసం 3 లెవల్లో వలయంలా ఉంటారు. వీళ్లు ఎల్లపుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తారు.

';


ప్రధాన మంత్రి వెంట వెళ్లేటప్పుడు ముదురు సన్ గ్లాసెస్ ధరించి ఉంటారు. అంతేకాదు ప్రత్యర్ధులు వీళ్ల ముఖంలో ఎలాంటి ముఖ కవళికలను కనుగొనకుండా గంభీరంగా ఉంటారు.

';


SPG ఉపయోగించే ఆయుధాలలో FN P90 మెషిన్ గన్స్, FN హెర్స్టాల్ F2000 రైఫిల్స్ మరియు గ్లాక్ 17 ఆటోమేటిక్ పిస్టల్స్ ఉంటాయి.

';


SPG కమాండో కావడానికి, మీరు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

';


IPS, CRPF, CISF లేదా ITBP వంటి బలగాల్లో చేరిన తర్వాత అందులో సుశిక్షితులైన వారిని SPGలో అవకాశం కల్పిస్తారు. అందులో అన్ని రకాలుగా ట్రైయిన్ అయిన తర్వాత ప్రధాన మంత్రి భద్రతా విభాగంలో తీసుకుంటారు.

';


భారతదేశంలో, SPG కమాండో యొక్క నెలవారీ జీతం రూ. 84,236 నుండి రూ. 2,39,457 వరకు ఉంటుంది. ఒక SPG భద్రతా అధికారి సంవత్సరానికి రూ. 13.2 లక్షల వరకు సంపాదించవచ్చు.

';

VIEW ALL

Read Next Story